అప్పుడే ఇంకోటి వచ్చిందా!

మాళవిక మోహనన్ కి తెలుగులో మెల్లగా క్రేజ్ పెరుగుతోంది. ఆమె ప్రస్తుతం ప్రభాస్ సరసన ఒక చిత్రం చేస్తోంది. మారుతి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి చేసుకొంది. ఐతే, ఈ సినిమా గురించి ఇప్పటివరకు అధికారికంగా ఒక్క ప్రకటన కూడా రాలేదు.

ఐతే, ఈ భామకి సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఫుల్లుగా ఎక్స్పోజింగ్ చేస్తూ ఫోటోలు అప్డేట్ చేస్తుంది. అందుకే ఆమెకి యూత్ లో క్రేజ్ వచ్చింది. మరోవైపు, మొదటి తెలుగు సినిమా ఇంకా పూర్తికాకముందే మరో సినిమా ఆఫర్ దక్కించుకుంది.

ఇద్దరు భామలు ఉండే ఆ పెద్ద హీరో సినిమాలో ఇప్పటికే ఒక అందాల రాశి మెయిన్ హీరోయిన్ గా ఉంది. రెండో భామగా మాళవికని తీసుకోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. సో… పారితోషికం, డేట్స్ గట్రా సెట్ ఐతే ఈ భామ అధికారికంగా సైన్ చేస్తుంది.

ఈ భామ అటు తమిళంలో విక్రమ్ సరసన నటిస్తోంది.

Advertisement
 

More

Related Stories