షూట్… రీషూట్ సినిమాలు ఇవే

Rowdy

ఒక సినిమా బాగా రావాలంటే ఎన్ని రీషూట్ లు చేసినా తప్పులేదు. విడుదలైన తర్వాత బాధపడడం కన్నా… షూటింగ్ టైంలోనే ఎన్ని కరెక్షన్లు చేసుకుంటే అంత మంచిది. ఐతే, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. తీసిందే మళ్ళీ మళ్ళీ తీస్తే ఆ మేకర్స్ చాలా  కన్ఫ్యూజన్ లో ఉన్నారనుకోవాలి. అనేకసార్లు రీషూట్ చేసుకొని… ఇంకా గుమ్మడికాయ కొట్టని చిత్రాల జాబితాలో అఖిల్, పూజా హెగ్డే నటిస్తోన్న”మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”  ముందు వరుసలో ఉంది.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”  2019లో మొదలైంది. 2020 వేసవిలో విడుదల కావాల్సిన ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. రెండు లాక్డౌన్ల వల్ల షూటింగ్ ఆలస్యం అయింది. దానికన్నా ముఖ్యంగా అనేకసార్లు రీషూట్ చేశారు. ఇంకా చేస్తున్నారు. మరి ఎప్పటికి దీనికి మోక్షం వస్తుందో చూడాలి.

ఇలాంటిదే మరో మూవీ… “రౌడీ బాయ్స్”. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తన కుమారుడు ఆశిష్ ని హీరోగా పరిచయం చేస్తూ “రౌడీ బాయ్స్” సినిమాని మొదలుపెట్టారు. హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. “హుషార్” సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన శ్రీహర్ష కొనుగంటి తీస్తున్న ఈ యూత్ ఫుల్ డ్రామా కూడా రీషూట్ ల మీద రీషూట్ లు జరుపుకుంటోంది. గతేడాదే విడుదల కావాల్సిన ఈ మూవీ ఇంకా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టలేదు.

దిల్ రాజు కుటుంబం నుంచి ఒక హీరో పరిచయం అవుతున్నాడు కాబట్టి ఆ సినిమా టీం అతి జాగ్రత్తలు తీసుకొని రిషూట్లు చేస్తోందట.

Advertisement
 

More

Related Stories