
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కలిసి సినిమా చూశారు. విదేశాల నుంచి రాగానే “ఓజీ” సినిమాని స్పెషల్ షో వేసుకొని చూశారు మెగాస్టార్. చిరంజీవితో కలిసి చరణ్ కూడా చూస్తున్నారు అని తెలియగానే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా షోకి విచ్చేశారు.
జ్వరం, వీక్నెస్ కారణంగా హైద్రాబాద్లోని ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ కూడా తన కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్య కూడా కలిసి సినిమా చూశారు మిగతా మెగా హీరోలతో కలిసి.
ఇది మెగా రీయూనియన్ అంటూ అభిమానులు ఆనందంగా ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు ఇప్పుడు.
అనంతరం ఈ సినిమాని పొగుడుతూ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దర్శకుడు సుజీత్ హాలీవుడ్ స్థాయిలో టేకింగ్ చేశాడని మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ స్వాగ్ అదిరింది, తనకెంతో గర్వంగా ఉందని తన ఆనందాన్ని పంచుకున్నారు మెగాస్టార్.





