రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్లైన 10 ఏళ్ల తర్వాత పాప పుట్టింది. దాంతో మొత్తం మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగి తేలుతోంది. పిల్లలు కలగడం ఆలస్యం కావడంతో తాను చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నట్లు ఆ మధ్య ఉపాసన తెలిపారు. ఎక్కడికి వెళ్లినా ‘గుడ్ న్యూస్’ ఎప్పుడు అని అడిగే వారు, దాంతో మానసికంగా కష్టంగా ఉండేది అనే ఆమె అన్నారు.
మెగాస్టార్, ఆయన భార్య సురేఖ కూడా తన కొడుకు, కోడలు తల్లితండ్రులుగా మారాలని దేవుళ్ళని మొక్కుకున్నారు. మొత్తానికి ఆ ఇంట్లోకి లిటిల్ మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. మెగాస్టార్ కి అందరూ మానవరాళ్లే. ఇద్దరు కూతుళ్ళకు చెరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కి కూతురు. సో, మొత్తంగా మెగాస్టార్ కి ఐదుగురు మనవరాళ్లు.
చరణ్ కూతురు పుట్టిన సందర్భంగా త్వరలోనే మెగాస్టార్ ఇండస్ట్రీ మిత్రులకు పెద్ద పార్టీ ఇవ్వనున్నారుట. ధూమ్ ధామ్ గా ‘మెగా రాకుమారి’ బర్త్ సెలెబ్రేషన్స్ ఉంటాయి.
మరోవైపు, రామ్ చరణ్, ఉపాసన తమ కూతురుకి ఏమి పేరు పెడతారని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు.
Veteran actor, director, and screenwriter K Bhagyaraj passed away on Saturday following a cardiac arrest.…
Tamannaah Bhatia has often acknowledged that Telugu and Tamil cinema played a crucial role in…
Director Rajamouli recently revealed that the shooting of “Varanasi” is expected to be completed by…
With just a week left for the release of Abhishek Nama’s ambitious mythological drama “Nagabandham”…
Samantha Ruth Prabhu-starrer “Maa Inti Bangaaram” continues its impressive run at the box office. The…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actors Ram Pothineni and…