- Advertisement -

మామూలు అమ్మాయిలే కాదు హీరోయిన్లకు కూడా అభిమాన హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు మిస్ ఇండియా ముద్దుగుమ్మలు కూడా అతని పేరే చెప్తున్నారు.
మిస్ ఇండియా 2022గా ఎన్నికైన సీనీ శెట్టి తన అభిమాన హీరో విజయ్ దేవరకొండ అని చెప్తోంది. అతన్ని కలిసే అవకాశం వస్తే గొప్పగా భావిస్తాను అని అంటోంది. బాలీవుడ్ హీరోల్లో షారుక్ ఖాన్, తెలుగులో దేవరకొండ ఇష్టమట.
మరి సినిమాల్లో అడుగుపెట్టే ఆలోచన ఉందా? “ప్రస్తుతం నా లక్ష్యం… మిస్ వరల్డ్ గా ఎన్నిక కావడం. ఆ పోటీలకు ప్రిపేర్ అవుతున్నా. సినిమా రంగంలోకి ఇప్పుడు అడుగుపెట్టే ఆలోచన లేదు.” ఇది ఆమె సమాధానం.
21 ఏళ్ల కర్ణాటక సుందరి సినిమాలు బాగా చూస్తుందట. విజయ్ దేవరకొండ సినిమాలు మరింత ఇష్ఠమట.
