మోహన్ బాబు పచ్చి బూతులు తిట్టారు!

మొన్న “మా” ఎన్నికల సమయంలో తమని మోహన్ బాబు బండ బూతులు తిట్టారని అంటున్నారు నటులు బెనర్జీ, ప్రభాకర్.

“ఎన్నికలు జరుగుతున్న టైంలో మోహన్ బాబు వచ్చారు. గొడవకు దిగారు. పచ్చి బూతులు, తల్లి పేరుతో తిట్టారు. అప్పుడే నిర్ణయించుకున్నాను ఇక ‘మా’లో పని చెయ్యకూడదని,” అని బెనర్జీ ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్పారు. దుఃఖం ఆపుకోలేక ఏడ్చారు. “నా జీవితంలో ఇంత అవమానం ఎప్పుడూ చూడలేదు… విష్ణు వచ్చి నన్ను పక్కకు తీసుకెళ్లాడు. లేదంటే మోహన్ బాబు కొట్టేవారేమో,” అని బెనర్జీ వివరించారు.

ఇలాంటి ‘మా’ సంస్థలో ఎందుకు ఉండాలి? అని బెనర్జీ ఏడ్చేశారు. మరో హీరో తనీష్ కూడా అదే మాట అన్నారు.

“ఈ ఎన్నికల్లో విష్ణు పోటీలో నిల్చున్నట్లు కనిపించలేదు. మోహన్ బాబు బరిలో ఉంటే ఆయనకీ సాయం చేసేందుకు విష్ణు, మనోజ్ వచ్చినట్లు అనిపించింది. ఆ టైంలో మనోజ్ లేకపోయి ఉంటే పెద్ద గొడవలు అయ్యాయి. అలా ప్రవర్తించారు మోహన్ బాబు,” అన్నారు నటుడు (ఈటీవీ) ప్రభాకర్.

 

More

Related Stories