అఖండ 2 ఉన్నా వస్తున్నారు

“అఖండ 2” సినిమా డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 12కి వాయిదా పడింది. డిసెంబర్ 11న పెయిడ్ ప్రీమియర్ షోలు కూడా పడుతున్నాయి. బాలయ్య – బోయపాటి సినిమా పోటీలో ఉన్నా తమ సినిమాలను తప్పించలేదు హీరో కార్తీ, యువ హీరో రోషన్ కనకాల.
నిజానికి “అఖండ 2” డిసెంబర్ 5న వస్తోంది కాబట్టే తమ సినిమాలను వారు డిసెంబర్ 12కి లాక్ చేసుకున్నారు. కానీ “అఖండ 2” చివరి నిమిషంలో ఆర్థిక సమస్యల్లో పడడంతో అది వారం ఆలస్యంగా వస్తోంది. దాంతో, తమ సినిమాని వాయిదా వేసుకోవాలని అనుకొంది “మౌగ్లీ” టీం. కానీ చివరికి ఒక రోజు మాత్రమే వాయిదా వేశారు.
“మౌగ్లీ”కి డిసెంబర్ 12న ప్రీమియర్ షోలు పడుతాయి. డిసెంబర్ 13న అన్ని థియేటర్లలో విడుదల అవుతుంది. అంటే “అఖండ 2” విడుదలైన ఒక రోజు గ్యాప్ లోనే ఈ సినిమా వస్తుంది.
ఇక కార్తీ నటించిన “అన్నగారు వొస్తారు” ముందు చెప్పిన డిసెంబర్ 12న డేట్ కే విడుదల అవుతోంది. ఎందుకంటే తమిళ్ లో అదే రోజున రానుంది. “అఖండ 2” కోసం తమిళ మార్కెట్ లో డేట్ మార్చుకోలేడు కార్తీ. సో, పోటీ ఉన్నా తెలుగులో కూడా అదే డేట్ కి వేస్తున్నారు.