
‘సీతారామం’ ఫేమ్ మృణాల్ కూడా అందాల ఆరబోతలో ముందుంది. అంతే కాదు, ఈ భామ కూడా సెక్స్ సీన్లలో నటించిన హీరోయిన్ల జాబితాలోకి చేరింది.
‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ కి చెందిన రెండో సీజన్ ఈ రోజు నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ రెండో సీజన్ లో తమన్న, కాజోల్, కొంకణా శర్మతో పాటు మృణాల్ కూడా నటించింది. ఇందులో మృణాల్ కూడా ఒక బెడ్ రూమ్ సీన్ లో హాట్ హాట్ గా నటించిందట. ఆ సీన్ లో కొన్ని సీన్స్ ని కుర్రాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆమె పేరుని ట్రెండ్ చేస్తున్నారు.
మృణాల్ బెడ్ పై పడుకున్న శృంగార సన్నివేశాల క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సిరీస్ లో తమన్న నటించిన హాట్ హాట్ సీన్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఐతే, తమన్న ఇంతకుముందే ఒక వెబ్ సిరీస్ లో సెక్స్ సీన్లు చేసింది. మృణాల్ కూడా ఇదే బాటలో హాట్ గా నటించడంతో ఆమె ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.
మృణాల్ కి ఇప్పటివరకున్న ఇమేజ్ వేరు. ఈ సిరీస్ తో ఆమె ఇమేజ్ మారిపోవడం ఖాయం.

“లస్ట్ స్టోరీస్ 2″కి రివ్యూస్ నెగెటివ్ గా వచ్చాయి. కానీ, ఇందులోని సెక్స్ సీన్లు మాత్రం సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్నాయి.
మృణాల్ ప్రస్తుతం తెలుగులో నాని సరసన ఒక మూవీ చేస్తోంది. విజయ్ దేవరకొండ సరసన కూడా ఒక మూవీ ఒప్పుకొంది.