
నభా నటేష్ మళ్ళీ గ్లామర్ డోస్ పెంచింది. కొంత గ్యాప్ తర్వాత ఫుల్ గ్లామరస్ ఫోటోషూట్ లని షేర్ చేసింది. ఇవి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఐతే, ఆమె ఇలా సడెన్ గా హీట్ పెంచడానికి రీజన్ కనిపిస్తోంది. ఇటీవల నాగ చైతన్య సరసన నటించే ఛాన్స్ వచ్చినట్లే వచ్చి మిస్ అయింది.
కొత్తగా సినిమా ఆఫర్లు రావట్లేదు. కృతి శెట్టి, కేతికా శర్మ వంటి కొత్త భామల వైపు ఫిల్మ్ మేకర్స్ ఫోకస్ పెట్టారు. ఇక సాయి పల్లవి, పూజ హెగ్డే వంటి క్రేజ్ వేరు. అంటే నభకి ఇక ఆఫర్లు రావడం కష్టమే. అందుకే… అవకాశాల కోసం ఈ అమ్మడు ఇలాంటి ఫోటోషూట్స్ ని మళ్ళీ మొదలు పెట్టింది.
Also Check Nabha Natesh Latest Photos
ఈ అమ్మడు ప్రస్తుతం నితిన్ సరసన ‘మేస్ట్రో’ సినిమాలో నటిస్తోంది. హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్ర అది. ఎన్నో అశలు పెట్టుకొని నటించిన ‘అల్లుడు అదుర్స్’ ఆమెకి బెదుర్స్ అనిపించింది. అందుకే ఇప్పుడు కెరీర్ విషయంలో జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది.