మావాళ్లకి అన్నీ తెలుసు కదా!

Naga Chaitanya

నాగ చైతన్య నటించిన మొదటి వెబ్ సిరీస్…. “దూత”. దీని ప్రమోషన్స్ లో భాగంగా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు నాగ చైతన్య. తన వ్యక్తిగత జీవితం గురించి మీడియా మాటిమాటికీ అడగడం కొంత ఇబ్బందిగా ఉందని నాగ చైతన్య చెప్పారు.

సమంతతో నాగ చైతన్య విడిపోయి చాలా కాలమే అవుతోంది. ఆ తర్వాత చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్ లో ఉన్నాడు టాక్. ఈ విషయంలో మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. ఈ పర్సనల్ విషయాలు మీడియాలో ఎక్కువ చోటు సంపాదించుకుంటున్నాయి అని చైతన్య కొంచెం చికాకులో ఉన్నాడు.

“నా వ్యక్తిగత జీవితంలో ఏమి జరిగింది, ఏమి జరుగుతోందో మా ఇంట్లో వాళ్లకు తెలుసు. నా స్నేహితులకు తెలుసు. మిగతా వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో జవాబు ఇవ్వాల్సిన పని లేదు,” అని వివరణ ఇచ్చారు.

ఇక నాగ చైతన్య ఈ నెల 9 నుంచి కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు.

Advertisement
 

More

Related Stories