డాడీకి హ్యాండిచ్చిన్న చైతన్య

Naga Chaitanya

నాగ చైతన్య తన డాడీ పెట్టిన ప్రపోజల్ కి నో చెప్పేశాడు. “బంగార్రాజు” పేరుతో నాగార్జున చేయాలనుకుంటున్న సినిమాలో నటించేందుకు చైతన్య ఒప్పుకోవడం లేదంట. “సోగ్గాడే చిన్ని నాయన” అనే హిట్ సినిమాకిది సీక్వెల్. ఐతే, ఇప్పుడు ఈ మూవీలో యాక్ట్ చేయలేనని తండ్రి నాగార్జునకి చైతన్య చెప్పేశాడు.

డేట్స్ లేవనేది…బయటికి చెప్పే కారణం. కానీ ఇన్ సైడ్ ముచ్చట వేరు. చైతన్యకి ఈ సినిమా చెయ్యాలని లేదట. ఆలాంటి కథల్లో కన్నా… విక్రమ్ కుమార్, శేఖర్ కమ్ముల ఇలాంటి దర్శకులతో వర్క్ చెయ్యడం బెటర్ అనేది చైతన్య ఫీలింగ్. అందుకే డాడీకి హ్యాండిచ్చాడు.

చైతన్య మనసు తెలుసుకున్న నాగార్జున ఇప్పుడు ఆ పాత్రకి వేరే వారిని అప్రోచ్ అవ్వాలని అనుకుంటున్నట్లు టాక్.

‘మజిలీ’ హిట్ తర్వాత నాగ చైతన్య తన స్టైల్ మార్చేశాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ‘లవ్ స్టోరీ’ పూర్తి చేశాడు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో “థాంక్యూ” అనే మూవీలో నటిస్తున్నాడు. ఆ తర్వాత మరో రెండు సినిమాలు లైన్లో పెడుతున్నాడు.

Advertisement
 

More

Related Stories