ట్విట్టర్లో యాక్టివ్ గా చైతన్య

Naga Chaitanya


నాగ చైతన్య ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారాడు. సమంతతో విడిపోయిన తర్వాత తన సినిమాలను ప్రోమోట్ చేసేందుకు ట్విట్టర్ ని ఎక్కువ ఉపయోగిస్తున్నాడు నాగ చైతన్య. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం పెద్దగా యాక్టివిటీ లేదు.

విడిపోయిన తర్వాత సమంత వరుసగా సినిమాలు సైన్ చేస్తూ బిజీగా మారిపోయింది. “విడిపోతే చచ్చిపోతానేమో అని అనుకున్నా. కానీ గట్టిగా నిలబడి పోరాడాను. ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నాను,” అని ఒక ఇంటర్వ్యూలో సమంత తెలిపింది. అందుకే, ఆమె ఎక్కువ సినిమాలు చేస్తూ నాగ చైతన్య లేకున్నా తన జీవితం, కెరీర్ బాగుంది అని చూపుతోంది.

నాగ చైతన్య ఇప్పటికే హీరోగా బిజీ. వరుసగా సినిమాలున్నాయి. ఇదివరకు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండేవాడు కాదు. ఇప్పుడు సినిమాలు ప్రమోషన్ కి ఇదే బెస్ట్ పద్దతి అని గ్రహించినట్లున్నాడు. వరుసగా ట్వీట్లు వేస్తున్నాడు.

జనవరిలో ‘బంగార్రాజు’ విడుదల కానుంది. ఆ తర్వాత ‘థాంక్యూ’ అనే సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే బాలీవుడ్ లో నటించిన తొలి చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ ఏప్రిల్ 14న విడుదల కానుంది.

Advertisement
 

More

Related Stories