వెంకీమామ బాటలోనే చైతన్య

Dhootha

నాగ చైతన్య నటించిన “దూత” డిసెంబర్ 1న విడుదల కానుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇది చైతన్య నటించిన మొదటి వెబ్ సిరీస్. చైతన్య ఈ వెబ్ సిరీస్ లో నటించి ఏడాదిన్నరపైనే అయింది. కానీ, రిలీజ్ కి మాత్రం ఇంతకాలం పట్టింది. ఈ వెబ్ సిరీస్ లో సాగర్ వర్మ అనే జర్నలిస్ట్ పాత్రలో నటించాడు నాగ చైతన్య.

“సమాచార్” అనే కొత్త పత్రికకు ఎడిటర్ గా ఎన్నికయిన జర్నలిస్ట్ పాత్రలో నాగ చైతన్య యథేచ్ఛగా బూతులతో కూడిన తిట్లను వాడినట్లు టాక్. ఈ రోజుల్లో వెబ్ సిరీస్ ల్లో సెక్స్ సీన్లు, బూతులు కామన్ గా మారాయి. కానీ తెలుగులో పేరున్న హీరో ఇలాంటి వాటిని వాడడం మొదలుపెట్టింది మాత్రం వెంకటేష్ దగ్గుబాటి.

“రానా నాయుడు” చిత్రంలో వెంకటేష్ నోటి నుంచి వచ్చిన పచ్చి బూతులు విని చాలామంది షాక్ తిన్నారు. వెంకటేష్ ని ఒక రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇప్పుడు మేనల్లుడు నాగ చైతన్య వెంకీమామ లెవల్లో కాకపోయినా బూతు తిట్లను తన డైలాగుల్లో ఇరికించాడని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే డిసెంబర్ 1 వరకు ఆగాల్సిందే.

మరోవైపు, నాగ చైతన్య నటించే కొత్త చిత్రం “తండేల్” డిసెంబర్ 9న మొదలుకానుంది.

Advertisement
 

More

Related Stories