తెగ మురిసిపోతున్న శౌర్య

naga shaurya sixpackmuripem

కొత్తగా మీసాలు వచ్చిన టీనేజ్ కుర్రాడు మాటిమాటికి అద్దంలో చూసుకొని మురిసిపోయినట్లు …గత ఏడాది కాలంగా నాగ శౌర్య తన జిమ్ ఫోటోలను షేర్ చేసుకుంటూ మురిసిపోతున్నాడు. అంతకుముందు నాగ శౌర్యకి సిక్స్ ప్యాక్ లేదు, కండలు లేవు. ఏడాదిగా అదే పనిలో ఉన్నాడు. అందుకే… ఆ ఫోటోలను తెగ పెడుతున్నాడు శౌర్య

మొత్తానికి సాధించాడు శౌర్య ప్యాక్ లు. ఒకప్పుడు పక్కింటి కుర్రాడులా ఉండేవాడు. ఇప్పుడు పక్కా హీమాన్ అయ్యాడు. ఇక ఇప్పుడు షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. తన 20వ చిత్రంలో ఆర్చర్ (విలుకాడు) పాత్ర కోసమే ఈ సిక్స్ ప్యాక్ కసరత్తు. కరోనా వల్ల ఆగిన షూటింగ్ మళ్ళీ మొదలవుతుంది.

శౌర్యలాగే సిక్స్ ప్యాక్ ప్రయత్నాల్లో ఉన్న అంటూ… ఇన్ స్టాగ్రామ్ లో తెగ ఫోటోలు పెట్టె మరో హీరో…నిఖిల్ సిద్ధార్థ్.

Related Stories