సైలెంట్ గా మొదలుపెట్టిన నాగ్

నాగార్జున తన వందో చిత్రం గురించి చాలా హడావుడి చేస్తాడనుకుంటే ఆయన సింపుల్ గా, సైలెంట్ గా మొదలుపెట్టారు. తమిళ యువ దర్శకుడు కార్తీక్ తీస్తున్న ఈ సినిమాకి సంబంధించి పనులు ఆర్నెల్లుగా సాగుతున్నాయి. ఐతే, నాగార్జున పుట్టిన రోజున (ఆగస్టు 29) కానీ లేదా అక్కినేని నాగేశ్వర రావు జయంతిన (సెప్టెంబర్ 20) కానీ ఈ సినిమా గురించి ప్రకటనో, సినిమా ప్రారంభం ఉంటుంది అని అభిమానులు ఆశించారు.
కానీ వాటిని పట్టించుకోకుండా తాజాగా ఆయన షూటింగ్ ప్రారంభించారు.
ఒకవైపు బిగ్ బాస్ 9వ సీజన్ కి హోస్ట్ గా ఉంటూనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. నాగార్జున స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇటీవల నాగార్జున రజినీకాంత్ నటించిన “కూలీ” సినిమాలో పక్కా విలన్ గా నటించారు. అలాగే ధనుష్ హీరోగా నటించిన శేఖర్ కమ్ముల చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించారు. హీరోగా వందో సినిమా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రత్యేక పాత్రలు కంటిన్యూ చేస్తారట.