విక్రమ్ గాంధీగా నాగార్జున!

Nagarjuna


హీరో నాగార్జున ప్రస్తుతం దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీస్తున్న యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి చేసుకొంది. ఆదివారం నాగార్జున (జనవరి 29) బర్త్ డే స్పెషల్ గా ఈ సినిమా టైటిల్ తో కూడిన పోస్టర్ విడుదలవుతుంది.

నాగార్జున ఇందులో విక్రమ్ గాంధీ అనే పాత్రలో కనిపిస్తారు. ఐతే, సినిమాకి మాత్రం ‘ఘోస్ట్’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు టాక్. నాగార్జున లాంటి సీనియర్ హీరోకి ఇలాంటి టైటిల్ బాగుంటుందా? ఫ్యాన్స్ ఓకే అంటారా అన్నది చూడాలి. ఐతే, కథ ప్రకారం ఇలాంటి టైటిల్ ని ఫిక్స్ చేశారట దర్శకుడు సత్తారు.

నాగార్జున ఈ సినిమాతో పాటు బంగార్రాజు అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.

Advertisement
 

More

Related Stories