నాగ్ రిలీజ్ చేసిన ‘గాలివాన’ ట్రైలర్‌

TeluguCinema 31 Mar 2022

ఒక యురోపియన్‌ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి తీసిన ఒరిజినల్‌ సిరీస్‌ … ‘గాలివాన’.

త్వరలోనే స్ట్రీమింగ్‌ కానున్న ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ ని అక్కినేని నాగార్జున రిలీజ్ చేశారు. 1:39 నిముషాల నిడివి కలిగిన ఆకట్టుకునేలా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన సస్పెన్స్‌ క్రైం థ్రిల్లర్‌గా అనిపిస్తోంది ఈ సిరీస్. రాధిక సెంటిమెంట్‌ డెలాగ్స్‌, ఆవేశం హైలెట్. సాయికుమార్‌ పాత్ర కూడా ఎమోషన్‌తో పాటు ఫ్యామిలీ బాండిరగ్‌కు ఉన్న విలువను చూపిస్తోంది.

ఈ వెబ్‌ సిరీస్‌ను ఏప్రిల్‌ 14న ZEE5 ఓటిటిలో స్ట్రీమింగ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

రాధికా శరత్‌ కుమార్‌, సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్‌, అశ్రిత, అర్మాన్‌, నందిని రాయ్‌, తాగుబోతు రమేష్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.