ఇఫీలో బాలయ్యకి సత్కారం

TeluguCinema Team 17 Nov 2025
Nandamuri Balakrishna

సినీ పరిశ్రమలో 50 ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణని భారతీయ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ వేదికపై సన్మానించనున్నారు.

నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NFDC), గోవా ప్రభుత్వంతో కలిసి ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ESG) సంయుక్తంగా నిర్వహిస్తున్న 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) ఈ ఏడాది నవంబర్ 20న ప్రారంభం కానుంది. గోవాలో జరిగే ఆరంభ వేడుకలో నందమూరి బాలకృష్ణని ఘనంగా సత్కరించనున్నారు.

100కిపైగా చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని IFFI 2025 వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. ఇదే వేదికపై బాలయ్య తన “అఖండ 2” చిత్రాన్ని కూడా ప్రమోట్ చెయ్యనున్నారు.

బాలయ్య నటించిన “అఖండ 2” డిసెంబర్ 5న విడుదల కానుంది.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

View all posts

Recent News