Advertisement
తెలుగు న్యూస్

ఎలా చెప్పాలి? నాని తికమక!

చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో ఉన్నారు నాని. సరిగ్గా 15 రోజుల క్రితమే ఒక మూవీ ఫంక్షన్ లో ‘థియేటర్లో సినిమాలు చూడడం మన కల్చర్’ అంటూ పెద్ద సందేశం ఇచ్చారు నాని. థియేటర్లని బతికించుకోవాలని పెద్ద డైలాగులు వేశారు నాని. రెండు వారాలకే ప్లేట్ ఫిరాయించారు. ఇప్పుడు ఆయన నటించిన ‘టక్ జగదీష్’ థియేటర్లో విడుదల కాబోవడం లేదు. ఓటిటి లోకి డైరెక్ట్ గా విడుదల కానుంది.

ఈ విషయం ఇప్పటివరకు మీడియా రాస్తోంది. ఇక నాని కూడా దాన్ని అధికారికంగా అనౌన్స్ చెయ్యాలి. అది జనాలకు కన్విన్సింగ్ ఎలా చెప్పాలి అనే విషయంలోనే నాని అయోమయంలో ఉన్నారట.

కరోనా కారణంగా తన సినిమాని ఓటిటిలో విడుదల చేస్తున్నాను అని చెప్పుకునే వీలులేదు నానికి. ఎందుకంటే గతేడాది “వి” సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసినప్పుడే తదుపరి చిత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లోనే విడుదల చేస్తానని అభిమానులకు ప్రామిస్ చేశారు నాని. గతేడాది చేసిన ప్రామిస్ కన్నా 15 రోజుల క్రితం పబ్లిక్ స్టేజిపైన “థియేటర్లలోనే సినిమాలు విడుదల చెయ్యాలి” అంటూ ఆయన పెద్ద లెక్షరు ఇచ్చి ఇప్పుడు మాట మార్చడం విచిత్రం. ఇది బాగా ఇబ్బంది పెడుతోంది నానిని.

అందుకే, జనాలకి ఎలా చెప్పాలి? ఎలా మేనేజ్ చెయ్యాలి అనే విషయంలో తర్జనభర్జన పడుతున్నారని టాక్. ఆయన పీఆర్ టీంకి ఇది పెద్ద పనే. మళ్ళీ కొత్త మాటతో కవర్ చెయ్యాలి!

Advertisement

This post was last modified on August 12, 2021 11:43 pm

Advertisement
Share