Advertisement
తెలుగు న్యూస్

అనిరుధ్ కన్ఫర్మ్ అయినట్లే!


ఎన్టీఆర్ తదుపరి చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అతని పేరు చాలాకాలంగా నలుగుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అనిరుధ్ కూడా ఓకే చెప్పాడట. అతను అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం గురించే ఈ చర్చ. కొరటాల శివ ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాకి మణిశర్మతో పాటలు చేయించుకున్నారు. ఎన్టీఆర్ చిత్రానికి అనిరుధ్ తో వర్క్ చెయ్యనున్నారు.

గతంలో దేవిశ్రీ ప్రసాద్ తో నాలుగు సినిమాలకు పాటలు చేయించారు కొరటాల శివ. కానీ ఇప్పుడు సినిమాకో సంగీత దర్శకుడు అన్నట్లు వెళ్తున్నారు. ఎవరినీ రిపీట్ చేసే ఆలోచనలో లేరట. అనిరుధ్ ఈ ఏడాది విడుదలైన “మాస్టర్” సినిమా తర్వాత తన పారితోషికాన్ని భారీగా పెంచారట. అయినా… అతనితోనే వెళ్లనున్నారు.

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పాటలు బాగా క్లిక్ అయ్యాయి. ఇప్పుడు దానికి మించి ఉండాలి అని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. అనిరుధ్ ఇటు యూత్ కి నచ్చేలా మ్యూజికే ఇవ్వగలడు, అటు మాస్ కి నచ్చే బీట్స్ కొట్టగలడు. అందుకే, అంత డిమాండ్.

Advertisement

This post was last modified on August 12, 2021 11:43 pm

Advertisement
Share