నానికి కోవిడ్ బ్రేకు!

- Advertisement -
Nani


నాని హీరోగా ‘అంటే సుందరానికి’ అనే కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమాలో నాని అమెరికా వెళ్ళిన తెలుగు బ్రాహ్మణ కుర్రాడిగా కనిపిస్తాడు. పూర్తిగా అమెరికా బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. సో, కథ ప్రకారం అమెరికాలో చాలా భాగం తీయాలి.

ఐతే, ఇప్పుడు అమెరికాలో మళ్ళీ కోవిడ్ కేసులు విజ్రంభిస్తున్నాయి. దాంతో, అక్కడికి వెళ్లేందుకు వీసా దొరుకుతుందా? ఒకవేళ దొరికినా అక్కడ షూటింగ్ చెయ్యడం కరెక్టేనా అన్న మీమాంసలో టీం పడింది. ప్రస్తుతానికి ఈ సినిమా అమెరికా షెడ్యూల్ కి బ్రేక్ పడింది అని అంటున్నారు.

ఈ సినిమాని ఈ ఆవకాయ సీజన్లో విడుదల చేద్దామని అనుకుంటున్నారు. కానీ వేసవిలో విడుదల డౌటే. అమెరికాలో కాకుండా దుబాయ్ లోనో లేదా ఇండియాలోనే స్టూడియోలో సెట్స్ వేసి లాగించాలి. లేదంటే పరిస్థితులు చక్కబడేవరకు ఆగాలి.

నాని ఈ ఏడాది ‘అంటే సుందరానికి’ సినిమాతో పాటు ‘దసరా’ అనే మరో సినిమాని కూడా విడుదల చెయ్యాలని ప్లాన్ గా పెట్టుకున్నాడు. ఈ రెండు చిత్రాలు షూటింట్స్ అనుకున్న టైంకి పూర్తి అయితేనే సాధ్యం.

More

Related Stories