ఇంకో మాస్ మూవీ ఇప్పుడే కాదు!


‘దసరా’ సినిమా హిట్ అయింది. నాని కెరీర్ లో ఇది మొదటి మాస్, రివెంజ్ డ్రామా. నానిని మాస్ అవతారంలో జనం చూస్తున్నారు కాబట్టి ఇక నేచురల్ స్టార్ మాస్ స్టార్ గా మారిపోతాడా? “అబ్బే అలాంటి ఆలోచన లేదు. వైవిధ్యమైన సినిమాలు చెయ్యడమే నా లక్ష్యం. జనం కూడా నా నుంచి అదే కోరుకుంటారు. ఒకటి హిట్ అయిందని మరోటి అదే పద్దతిలో చేస్తే జనం రిజెక్ట్ చేస్తారు. ఆ క్లారిటీ ఉంది,” అని నాని వివరించారు.

దసరా విజయం చాలా సంతృప్తి ఇచ్చింది అని చెప్తున్నారు నాని. అమెరికాలో 2 మిలియన్ డాలర్ల సినిమా కొట్టాలన్న లక్ష్యం ఈ సినిమాతో తీరేలా ఉంది. ఈ సినిమా ఇప్పటికే 1.7 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. రెండో వీకెండ్ కి 2 మిలియన్ డాలర్ల టార్గెట్ రీచ్ అయ్యేలా ఉన్నారు నాని.

ప్రస్తుతం నాని ఒక ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నారు. ఆరేళ్ళ కూతురికి తండ్రి పాత్ర అది. కొత్త దర్శకుడు తీస్తున్న ఈ మూవీలో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్.

“పెద్ద దర్శకులు కథ చెప్పి సినిమా చెయ్యమంటే చేస్తాను. కానీ, కొత్త దర్శకులను పరిచయం చెయ్యడం మానను,” అని కూడా నాని క్లారిటీ ఇచ్చారు.

Advertisement
 

More

Related Stories