350 కోట్లు కలెక్ట్ చేస్తుంది: నవీన్

TeluguCinema 28 Dec 2021
naveen yerneni mythri


మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ‘పుష్ప’ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 275 కోట్ల రూపాయల వసూళ్లు అందుకొందట. ఈ విషయాన్ని ఈ రోజు థాంక్స్ మీట్ లో ప్రకటించారు నిర్మాత నవీన్ యెర్నేని. మరో 50 నుంచి 75 కోట్ల రూపాయలను లాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

“2021లో అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా జనవరి 6 వరకే థియేటర్లలో ఉంటుంది. ఆ తర్వాత ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల కానుంది. కాబట్టి ఇది 325 నుంచి 350 కోట్ల వరకు వసూళ్లు అందుకుంటుందని భావిస్తున్నాం. పండగ వరకు ఉంటే…ఇంకా ఎక్కువ వసూలు చేసేది,” అని నవీన్ తెలిపారు.

తమ సంస్థని పాన్ ఇండియా లెవల్లో పరిచయం చేసినందుకు హీరో అల్లు అర్జున్ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. సుకుమార్ వల్ల తమ సంస్థకి మరో భారీ హిట్ వచ్చిందని చెప్పారు ఆయన.

హీరో అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక కూడా ఈ మీట్ లో పాల్గొన్నారు.