ఇక అషు రెడ్డికి చిక్కులే!

TeluguCinema 24 Jun 2023
Ashu Reddy

‘కబాలి’ సినిమా తెలుగు హక్కులు కొని విడుదల చేసిన నిర్మాత కేపీ చౌదరిని ఇటీవల డ్రగ్స్ కేసులో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా పోలీసు విచారణలో 12 మంది పేరున్న వ్యక్తులతో అతనికి సంబంధాలు ఉన్నట్లు బయటికి వచ్చింది. అందులో సురేఖావాణి, జ్యోతి, అషు రెడ్డి వంటి పేర్లు వచ్చాయి.

వీరిలో అషు రెడ్డి ఎక్కువ పాపులర్. ఆమెకి దాదాపు 2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు ఇన్ స్టాగ్రామ్ లో. ఇన్ స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ బాగా పాపులర్ అయింది. ఆమె సంపాదన కూడా ఎక్కువే ఈ పాపులారిటీ వల్ల. అంతే కాదు, ఆమె ఎప్పుడూ దుబాయ్, అమెరికా, థాయిలాండ్ వంటి దేశాలకు వెళ్లి వస్తున్నట్లు ఫోటోలు పెడుతుంది. ఐతే, ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఆమె పేరు రావడం వల్ల ఆమె క్రేజ్ కొంత మసకబారుతుంది.

తనపై మీడియా రాస్తున్న వార్తలను ఆమె ఇప్పటికే తప్పుబట్టింది. ముఖ్యంగా తన ఫోన్ నంబర్ ని టీవీ స్క్రీన్లపై పెట్టడాన్ని ఆమె నిరసించింది. ఇక ఈ కేసులో మీడియా అవాస్తవాలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించింది అషు రెడ్డి.

ALSO READ: Ashu Reddy’s name appears in KP Choudhary’s case

Ashu Reddy

డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వ్యక్తితో ఆమె మాట్లాడినట్లు రికార్డులు ఉన్నంత మాత్రానా ఆమెకి ఇబ్బంది ఉండదు. కానీ, అతనితో ఆమె డ్రగ్స్ కి సంబందించిన లావాదేవీలు జరిపి ఉంటే సమస్య. ఐతే, ఈ కేసు వల్ల ఆమెకి వ్యాల్యూ తగ్గుతుంది. కొంత క్రేజ్ పోతుంది.