ఆ రెండింటికి మోక్షం ఎప్పుడో?

TeluguCinema 21 Jun 2023
nidhhi stills 200623 001


నిధి అగర్వాల్ ది చాలా విచిత్రమైన పరిస్థితి. ఈ అమ్మడు ఇద్దరు టాప్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఒకేసారి ఇద్దరి బడా హీరోల చిత్రాల్లో అవకాశం వస్తే ఆ హీరోయిన్ గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది. కానీ నిధి కెరీర్ మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా సాగుతోంది.

దానికి కారణం ఒక సినిమాకి మోక్షం ఎప్పుడో తెలియదు. ఇంకోదానికి అధికారికంగా ప్రకటన రాలేదు. ఆమె పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హరి వీరమల్లు’ చిత్రంలో అవకాశం పొందింది చాలా నెలల క్రితం. ఈ సినిమా వచ్చే ఏడాది కూడా విడుదలవుతుందా లేదా అన్నది క్లారిటీ లేదు. ఈ సినిమా షూటింగ్ ఆగి చాలా కాలమే అయింది. పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందన్న ఆనందమే కానీ దాని వల్ల ఆమె కెరియర్ కి అదనపు ప్రయోజనం కలగలేదు.

ఇక ప్రభాస్ సరసన కూడా నటిస్తోంది ఈ భామ. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ తో పాటు నిధి నటిస్తోంది. ఈ సినిమాని ఇంకా అధికారికంగా జనాలకు చెప్పలేదు కానీ షూటింగ్ జరుగుతోంది. ఇది వచ్చే ఏడాది విడుదల అవుతుంది.

‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని ఈ అమ్మడు 2020లో ఒప్పుకొంది. ప్రభాస్ మూవీ 2022లో సైన్ చేసింది. కానీ ఈ రెండూ 2024లో వచ్చేలా ఉన్నాయి.