అందాల నిధి నిరీక్షణ!

- Advertisement -
Nidhhi Agerwal


పవన్ కళ్యాణ్ సరసన అవకాశం రాగానే తన దశ మారిపోయిందని సంబరపడింది. కానీ, కరోనా లాక్డౌన్, పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు ఇతర కారణాల వల్ల ‘హరి హర వీరమల్లు’ ఇంతవరకు షూటింగ్ పూర్తి చేసుకోలేదు. రెండున్నరేళ్లు గడిచిపోయాయి. ఆ సినిమా విడుదల కావాలంటే మరో ఆరు నెలలు ఆగాలి ఈ భామ.

‘హరి హర వీర మల్లు’ తర్వాత ఇతర పెద్ద సినిమాలు తన వల్లో వాలుతాయని భావించింది. ఐతే, ‘హరి హర వీరమల్లు’ వల్ల ఈ భామకి కెరీర్లో బాగా గ్యాప్ పెరిగిపోతోంది. ఈ ఏడాది ‘హీరో’ అనే సినిమాలో ఆమె కనిపించినా ఆ చిత్రం ఆమెకి ఎటువంటి హెల్ప్ చెయ్యలేదు. పైగా, డ్యామేజ్ చేసింది. అందుకే, పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కోసమే ఆమె నిరీక్షిస్తోంది.

మంచి శరీర సౌష్టవంతో కుర్రాళ్ళ మనసు దోచుకున్న ఈ భామకి రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో నటించాలని కోరిక. ‘హరి హర వీరమల్లు’ హిట్ అయి క్రేజ్ వస్తే ఆటోమేటిక్ గా ఆ అవకాశాలు లభిస్తాయి.

ప్రస్తుతం ఆమె తన అభిమానులతో టచ్ లో ఉండేందుకు, ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లు అప్డేట్ చేస్తోంది.

 

More

Related Stories