అనుపమతో నిఖిల్ కిప్పుడు హ్యాపీ!

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఒకే హీరోతో వరుసగా రెండు చిత్రాలు చేసింది. ఒకటి ‘కార్తికేయ 2′, రెండోది ’18 పేజెస్’. రెండింటిలోనూ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ‘కార్తికేయ 2’ ఈ శనివారం (ఆగస్టు 13) విడుదల కానుంది.

రెండు వారాల క్రితం అనుపమపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు నిఖిల్. అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది కానీ ప్రొమోషన్ కి రమ్మంటే హ్యాండిస్తుంది అని ఆమెపై కామెంట్ చేశాడు. దాంతో, అనుపమ సోషల్ మీడియా వేదికగా తప్పంతా ‘కార్తికేయ 2’ సినిమా మేకర్స్ ది అని తేల్చి చెప్పింది. సినిమాని అనేకసార్లు డేట్స్ మార్చి తన టైం వేస్ట్ చేశారన్నట్లుగా స్పందించింది. దాంతో, హీరో, నిర్మాతలు ఆమెని బుజ్జగించారు. దాంతో ఆమె ప్రొమోషన్ లలో పాల్గొనడం మొదలు పెట్టింది.

ఇప్పుడు ఇద్దరూ కలిసి అనేక సిటీస్ తిరుగుతున్నారు. ఆమెతో కలిసి మీడియాకి ఫోజులిస్తున్నాడు. అనుపమతో ఇప్పుడు ఏ ఇబ్బంది లేనట్లుంది ఈ కార్తికేయ హీరోకి.

‘కార్తికేయ 2’ సినిమా విషయంలో ఏడుపులు, ఆరోపణలు, దెప్పిపొడుపులు… అన్నీ చేశాడు నిఖిల్. మరి అతని ఈ చర్యలు హిట్ కి అనుకూలిస్తాయా?

Advertisement
 

More

Related Stories