సరైన టైంలో సరైన నిర్ణయం!

Maestro


నితిన్ ఈ ఏడాది ఇప్పటికే రెండు ఫ్లాపులు అందుకున్న విషయం మళ్ళీ మళ్ళీ మెన్షన్ చెయ్యక్కర్లేదు కదా. తక్కువ గ్యాప్ లో మూడో సినిమాకి థియేటర్లోకి తీసుకొస్తే క్రేజ్ వచ్చేది కాదు. ఆ విషయం అర్థం చేసుకొని, ‘మాస్ట్రో’ సినిమాని థియేటర్లోకి తీసుకురావట్లేదు.

‘మాస్ట్రో’ ఆగస్టులో హాట్ స్టార్ వేదికపై విడుదల అవుతుంది. ఇది ఫిక్స్. దాదాపు 27 కోట్లు ఖర్చు అయింది ఈ సినిమాకి. 30 కోట్లకు హాట్ స్టార్ కొనుక్కొంది. శాటిలైట్, డిజిటల్, డైరెక్ట్ ఓటిటి వంటి అన్ని హక్కులను తీసుకొంది హాట్ స్టార్/స్టార్ గ్రూప్. మూడు కోట్లు లాభం. దానికి తోడు, హిందీ డబ్బింగ్ రైట్స్ నిర్మాత వద్దే ఉంటాయి. అదొక ఏడు కోట్ల వరకు వస్తుంది.

నితిన్ తండ్రి ఈ సినిమాకి నిర్మాత. ఎటువంటి రిస్క్ లేకుండా 10 కోట్లు వెనకేసుకున్నారు నితిన్ ఫ్యామిలీ మెంబర్స్. థియేటర్లో విడుదల చెయ్యాలని మొండిగా వెయిట్ చెయ్యకుండా సరైన టైంలో నితిన్ సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఇది కూడా థియేటర్లో విడుదలయ్యి ఒకవేళ రిజల్ట్ తేడా కొడితే… నితిన్ మార్కెట్ దారుణంగా పడిపోయేది.

ఏ రకంగా చూసిన హాట్ స్టార్ లో ‘మాస్ట్రో’ని రిలీజ్ చెయ్యడం నితిన్ కి ప్లస్సే.

Advertisement
 

More

Related Stories