చెన్నైలో సినిమాలు వద్దు!

TeluguCinema 27 Apr 2022
nivetha thumb 1


నివేత పేతురాజు. ఈ పేరు చెప్తే చాలు పక్కా తమిళ పొన్ను అని అర్థం అవుతుంది. అవును… ఈ అందాలరాశి అచ్చ చెన్నై సుందరి. కానీ, ఆమె చెన్నైలో సినిమాలు చెయ్యాలన్నా, తమిళ సినిమా ఆఫర్లన్నా ఆసక్తి చూపడం లేదంట.

ఈ అందాల భామకి అక్కడ ఎదో సమస్య ఉంది కాబోలు. లేదు తెలుగు సినిమాల మీద ఎక్కువ ఆసక్తి అని అనుకోవాలా? కారణం ఏదైనా చెన్నైలో సినిమాలు చెయ్యడం కన్నా హైదరాబాద్ లో ఆమెకి కంఫర్ట్ అన్న మాట నిజమే అని ఇండస్ట్రీ వర్గాల మాట. అందుకే, తెలుగులో వరుసగా సినిమాలు ఒప్పుకొంటోంది. వీలైనంత వరకు ఇక్కడే సినిమాలు చేసే ప్రయత్నంలో ఉంది.

తెలుగులో ప్రస్తుతం ఈ భామ విశ్వక్ సేన్ సరసన ఒక చిత్రం, కార్తికేయతో మరో చిత్రం చేస్తోంది.

నివేత పేతురాజుకి రేసింగ్ అన్నా ఇష్టం. కారు రేసింగ్ లో శిక్షణ కూడా తీసుకొంది. అది కూడా చెన్నైలోనే నేర్చుకొంది. కానీ, కెరీర్ ని మాత్రం తెలుగునాట చూసుకుంటోంది. ఏంటో మరి ఆ మర్మం!