కుక్క కాటు… నివేతకు ఘాటు

TeluguCinema 25 Nov 2025
Nivetha Pethuraj

తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది నటి నివేతా పేతురాజు. ఇక్కడ రాజకీయ వివాదాల కారణంగా ఆమె సైలెంట్ గా దుబాయ్ లోనే సెటిల్ అవుతుందని అందరూ అనుకున్నారు. చెన్నైలో ఉండే ఈ భామ ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు మొత్తం సెట్ చేసుకుందని ప్రచారం జరిగింది. అందులో భాగంగానే దుబాయ్ లో పనిచేసే కుర్రాడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటోంది అనే మాట వినబడింది.

కానీ ఆమె తాజాగా చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఒక కామెంట్ చేసి వివాదం రేపింది. మళ్ళీ వార్తల్లో నిలిచింది.

కుక్క కాటును ప్రజలు ఎక్కువ చూసి చేయకూడదని తన అభిప్రాయాన్ని చెప్పి ఆమె వివాదంలో పడింది.

“కుక్క కాటును మనం పెద్ద విషయంగా చూపి భయాన్ని సృష్టించకూడదు. మన కళ్ళ ముందే క్రూర సంఘటనలు జరుగుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా ఎవరూ గొంతు విప్పరు. కుక్క కాటు ద్వారా వ్యాపించే రేబిస్ చాలా తీవ్రమైన విషయం అనేది నిజం. కానీ భయాన్ని వ్యాప్తి చేసే బదులు. అసలు పరిష్కారం ఏమిటో మనం ప్రజలకు నేర్పించాలి. వీధి కుక్కలను చంపడం పరిష్కారం కాదు,” అని ఆమె తన అభిప్రాయాన్ని పేర్కొంది.

కుక్క కాటుని ఆమెని తక్కువ చేస్తోందని, ఆమె కారు దిగి ఏదైనా చిన్న వీధిలో తిరగాలని, అప్పుడు కుక్క కాటు ఎలా ఉంటుందో ఆమెకి తెలిసి వస్తుంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దుబాయ్ లో దాక్కొని అప్పుడప్పుడు చెన్నైకి వచ్చే నీకు ఎందుకు చెన్నైలో కుక్కలా గురించి అని ప్రశ్నిస్తున్నారు.