ఈ నివేత సన్నబడుతోంది

ఒక నివేథ (పేతురాజ్) తన బాయ్ ఫ్రెండ్ ని ప్రపంచానికి పరిచయం చేసి పెళ్ళికి రెడీ అవుతోంది. మరో నివేత సన్నబడుతోంది.
నివేత థామస్ అద్భుతమైన నటి. అభినయంలో ఆమెకి సాటి లేరు. కానీ ఆమె ఊహించనంతగా లావు ఎక్కింది ఆ మధ్య. నేటి జయలలిత అనే కామెంట్స్ వచ్చాయి. అంతగా ట్రోల్ అయింది ఆమె తన లావు కారణంగా. కొన్ని ఆరోగ్య సమస్యల వల్లే ఇలా బరువు కంట్రోల్ తప్పింది అని ఆమె టీం చెప్పింది.
ఐతే, తాజాగా వినాయక చవితి సందర్భంగా నివేత షేర్ చేసిన ఫోటోలు చూసి అందరూ స్టన్ అయిపోతున్నారు. చాలా మార్పు కనిపిస్తోంది ఆమెలో. బరువు తగ్గింది. తగ్గే ప్రాసెస్ లో ఉంది. పై ఫోటో లేటెస్ట్. ఆమె తాజా లుక్, ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
గతేడాది ఆమె ఎలా ఉందో ఈ కింది వీడియోలో చూడండి.
Nivetha Thomas in 2024
మరీ జీరో సైజ్ లో కాకపోయినా చాలా వరకు బరువు తగ్గితే ఈ భామకి మళ్ళీ అవకాశాలు క్యూ కడుతాయి. ఆమె వయసు కూడా తక్కువే. ఇంకా 30 దాటలేదు మరి.