ఆ పాటపై నిర్ణయం తీసుకోలేదంట

ఈమధ్య సినిమాల నుంచి పాటలు తీసేయడం కామన్ అయిపోయింది. భారీగా ఖర్చు పెట్టి సాంగ్స్ తీయడం, ఆ తర్వాత ఫ్లో దెబ్బతింటోందని తీసేయడం కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. ‘మిరాయి’, ‘దేవర’ సినిమాల నుంచి తాజాగా వచ్చిన ‘ఓజీ’ వరకు ఇదే పరిస్థితి.
‘ఓజీ’లో నేహాశెట్టితో ఓ స్పెషల్ సాంగ్ తీశారు. కానీ ఆఖరి నిమిషంలో సాంగ్ కట్ చేశారు. సినిమా సెకెండాఫ్ లో ఆ పాట వస్తుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ ప్రియాంక చనిపోయిన తర్వాత వచ్చే సాంగ్ అది.
హీరోయిన్ చనిపోయిన తర్వాత అలాంటి సాంగ్ వస్తే బాగుండదని, పైగా సినిమా స్క్రీన్ ప్లే దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఆ పాటను తొలిగించినట్టు యూనిట్ తెలిపింది.
‘మిరాయి’, ‘దేవర’ సినిమాలకు విడుదలైన కొన్ని రోజుల తర్వాత పాటలు యాడ్ చేశారు. ‘ఓజీ’ సినిమాకు అలాంటి ఆలోచన కూడా లేదని అంటోంది యూనిట్. ప్రస్తుతానికి ఆ సాంగ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.