మొదటి వారం అందరూ సేఫ్!


‘బిగ్ బాస్’ 6వ సీజన్ మొదలై అప్పుడే వారం గడిచింది. ప్రతి వీకెండ్ ఒకరు ఇంటి బాట పట్టాల్సిందే. ఐతే, ఈవారం అలా జరగలేదు.

ఈ వీకెండ్ 7గురు నామినేట్ అయ్యారు. ఐతే, ఈ సారి లక్ కలిసొచ్చింది కంటెస్టెంట్లకు. ఎవరూ ఎలిమినేట్ కాలేదు. ఇంకో ఛాన్స్ ఇద్దామని హోస్ట్ నాగార్జున నిర్ణయించడంతో అందరూ బతికిపోయారు.

ముఖ్యంగా నటి అభినయశ్రీ ఊపిరి పీల్చుకొంది. ఆమె మొదటివారమే ఇంటికి వెళ్తుంది అనిపించింది. సెలబ్రిటీ పోటీదారుగా అడుగుపెట్టిన అభినయశ్రీని మొదటివారమే పంపకూడదని ఉద్దేశంతోనే ఎలిమినేషన్ ని ఈ వీకెండ్ రద్దు చేసినట్లు అర్థం అవుతోంది. మొత్తంగా 21 మంది కంటెస్టెంట్లు రెండో వారం కూడా ఆడుతున్నారు.

గీతూ రాయల్ అనే యూట్యూబర్ మొదటివారం ఎక్కువ నెగెటివ్ టాక్ తెచ్చుకొంది. వరస్ట్ కంటెస్టెంట్ అన్న పేరు వచ్చింది ఆమె గయ్యాళితనం వల్ల.

 

More

Related Stories