ఆదివారం కూడా చెయ్యకతప్పదు!

- Advertisement -

హీరోయిన్ అన్న తర్వాత ఫిట్ నెస్ లేకుంటే కష్టం. ముఖ్యంగా వయసు 30 దాటిన భామలు రిలాక్స్ అయితే అంతే సంగతులు. అందుకే, తమన్న క్రమం తప్పకుండా ఎక్సర్ సైజులు చేస్తుంటుంది. ఆదివారం కూడా విశ్రాంతి తీసుకోదట.

ఈ ఆదివారం కూడా జిమ్ములో కసరత్తులు చేస్తున్న ఫోటోని అప్డేట్ చేసింది. నో రెస్ట్ అనే కామెంట్ రాసుకొంది.

16 ఏళ్ల కెరీర్, 30 ఏళ్ల వయసు… ఆఫర్లు మాత్రం తగ్గలేదు. ఇప్పుడు టీవీ తెరపైకి కూడా రానుంది. ఓటిటి సిరీస్ లు, టీవీ షోలు, సినిమాల్లో హీరోయిన్ వేషాలతో పాటు మధ్యమధ్యలో ఐటెం సొంగులు, బ్రాండ్ ఎండార్స్ మెంట్లు… ఇలా ఫుల్లుగా సంపాదిస్తోంది. మరి ఇవన్నీ కాపాడుకోవాలంటే ఫిట్ నెస్ ని కాపాడుకోవాలి కదా. అందుకే ఇంత కష్టపడుతోంది మిల్క్ బ్యూటీ.

Also Check: Tamannaah Bhatia’s stunning new pics

కెరియర్ కి మళ్ళీ ఊపు రావడంతో తమన్న తన పెళ్లి ఆలోచనని కూడా వాయిదా వేసుకొంది.

 

More

Related Stories