లాంబోర్గ్ని ముందు ఎన్టీఆర్ ఫోజు

NTR Lambhorghini


అత్యంత ఖరీదైన లాంబోర్గ్ని కారుని జూనియర్ ఎన్టీఆర్ కొన్న విషయం తెలిసిందే. ఇదే ఆయన కారు అంటూ గత నెల రోజులుగా సోషల్ మీడియాలో ఫోటోలు హల్చల్ చేశాయి. ఎన్టీఆర్ తన కారు ముందు నిల్చున్న అసలైన ఫోటో ఇప్పుడు బయటికి వచ్చింది.

హైదరాబాద్ కి వచ్చిన ఆ కారు ముందు హీరో శ్రీకాంత్, లాంబోర్గ్ని డీలర్, ఎన్ఠీఆర్ నిల్చున్న ఫోటో ఇది. దాదాపు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ఈ కారులో ఎన్టీఆర్ ఇక హైదరాబాద్ రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తాడు.

ఎన్టీఆర్ కి ఖరీదైన కార్లంటే మోజు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ కొంటూ ఉంటాడు. లాంబోర్గ్ని కంపెనీకి చెందిన కార్లు మన దేశంలో చాలా తక్కువమంది వద్దే ఉన్నాయి. ఎన్టీఆర్ కొన్నఈ “గ్రాఫిక్ యూరస్” అనే మోడల్ మాత్రం ఇండియాలో మొదటి కారు. మనదేశంలో లాంచ్ కాకముందే ఎన్టీఆర్ బుక్ చేశారు. మొదటి కారుని ఎన్టీఆర్ కి పంపించింది ఆ కంపెనీ.

ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాకి 30 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. టీవీ షో వ్యాఖ్యాతగా, బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఆర్జన బాగుంది.

Advertisement
 

More

Related Stories