‘సర్కారు’లో గంటన్నర వినోదం!

Sarkaru Vaari Paata


మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ హంగామా రేపటినుంచి (మే 12) మొదలు. ఈ సినిమాలో వినోదానికి పెద్ద పీట వేశారట. ‘దూకుడు’ సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య విదేశాల్లో తీసిన రొమాంటిక్ ట్రాక్ ఎలా మెప్పించిందో అలా ఇందులోనూ అమెరికాలో సాగే సీన్లు ఆకట్టుకుంటాయట. ఎంటర్టైన్మెంట్ ఎక్కువగానే ఉందని అంటున్నారు.

దాదాపు గంటన్నర పాటు కామెడీ సీన్లు ఉంటాయట.

దర్శకుడు పరశురామ్ కామెడీ పండించడంలో దిట్ట. ‘గీత గోవిందం’ సినిమాలో తన మార్క్ ఏంటో చూపించాడు. ఇందులో, మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గట్లు భారీ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనేది టీం మాట. అలాగే, మాస్ ప్రేక్షకులకు కావాల్సిన సరుకు కూడా గట్టిగానే ఉందట.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదలైన రెండున్నరేళ్ల తర్వాత ‘సర్కారు వారి పాట’ థియేటర్లలోకి వస్తున్న మహేష్ బాబు మూవీ ఇది. దీనిపై సూపర్ స్టార్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 

More

Related Stories