పవన్ “పాలిట్రిక్స్” అదిరాయిగా!

TeluguCinema 21 Jun 2023
pawanpolitricks


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ఇక డైరెక్ట్ వార్ ప్రకటించారు. తాజాగా ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన వైఖరి స్పష్టం చేశారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కి సరైన ‘రాజకీయ ట్రిక్స్’ తెలియవు అనే పేరుంది. కానీ ఈ ఇంటర్వ్యూ చదివితే ఆయన క్లారీటీగానే ఉన్నారు అనిపిస్తోంది. పొత్తులతోనే ఫైట్ అని స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ ‘పాలిట్రిక్స్’లో ముదిరిపోయినట్లు కనిపిస్తోంది. మరి ఆయన పాలిటిక్స్ కి, మన తెలుగు సినిమాకి ఏంటి సంబంధం అంటారా? ఉంది. ఆయన ఇప్పుడు డైరెక్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్ ప్రకటించారు కాబట్టి త్వరలో విడుదల కాబోయే ‘బ్రో’, ఈ ఏడాది చివర్లో వచ్చే ‘ఓజీ’ సినిమాల టికెట్ రేట్ల విషయంలో మళ్ళీ తకరారు ఉండే అవకాశం ఉంది.

‘బ్రో’ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటించారు. హీరోగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ నటించాడు. ఇది మల్టీస్టారర్ మూవీ. ఈ సినిమా బడ్జెట్ సాధారణమే. గట్టిగా ఓపెనింగ్స్ వస్తే చాలు నిర్మాతలు సేఫ్ అవుతారు. ఐతే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచే అవకాశం ఉండదు.

ఆంధ్రప్రదేశ్ లో అదనపు షోలు కూడా డౌటే.

ఇక, పవన్ కళ్యాణ్ షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో కూడా ఇంకా క్లారిటీ రావాలి. ప్రస్తుతానికి ఐతే, ఆయన “ఓజీ” షూటింగ్ పూర్తి చేస్తారు అనిపిస్తోంది. “బ్రో” షూటింగ్ ఆల్రెడీ పూర్తి అయింది. “హరి హర వీరమల్లు”, “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రాలు వచ్చే ఏడాది విడుదల అవుతాయి. వాటి షూటింగ్ లు కూడా వాయిదా పడుతాయి.