ఐనా ఆగని టైటిల్ ప్రచారాలు

- Advertisement -
Pawan Kalyan

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో ప్రకటించిన రెండో చిత్రం ఇంకా మొదలు కాలేదు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండు చిత్రాలు (అయ్యపనం కోషియం రీమేక్, ‘హరి హర వీరమల్లు’) సగంలో ఉన్నాయి. అంటే… హరీష్ శంకర్ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ గ్యాప్ లో ఈ సినిమా టైటిల్ ఇదంటూ అభిమానులు పోస్టర్లు రెడీ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

వీటిపై ఇప్పటికే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, దర్శకుడు హరీష్ శంకర్ వివరణ ఇచ్చారు. ఒక సూపర్ టైటిల్ ఆల్రెడీ ఫిక్స్ చేశామని, దాన్ని సరైన టైంలో ప్రకటిస్తామని చెప్పారు.

అంత క్లారిటీ ఇచ్చినా అభిమానులు ప్రచారం చెయ్యడం మానలేదు. ఊహాగానాలు ఇంకా ఊపందుకున్నాయి. ‘స్టేట్ కి ఒక్కడు’, ‘సంచారి’ అనే టైటిల్స్ బాగా వైరాలయ్యాయి.

More

Related Stories