అయన, ఈయన ఒకడేనా పాయల్?

హఠాత్తుగా బాంబ్ పేల్చింది పాయల్ ఘోష్. బాలీవుడ్ స్టార్ డైరక్టర్ అనురాగ్ కశ్యప్ తనను రేప్ చేయడానికి ట్రై చేశాడంటూ తీవ్ర విమర్శలు చేసింది. అదేదో సినిమా స్క్రీన్ ప్లే చెప్పినట్టు.. గదిలోకి తీసుకెళ్లి జిప్ తీసి ఏమేం చేశాడనేది విడమర్చి చెప్పింది. ఆమె ఆరోపణల్లో నిజం ఎంతనే విషయాన్ని పక్కనపెడితే.. ఆమె ఇలాంటి పనేదో చేస్తుందని కొంతమంది ముందే ఊహించారు. దానికి ఓ కారణం ఉంది.

సరిగ్గా వారం కిందట కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్ని తెరపైకి తీసుకొచ్చింది పాయల్. ఓ బాలీవుడ్ దర్శకుడు తనను వేధించాడని, గదిలో సోఫాలో కూర్చోబెట్టి బ్లూ ఫిలిమ్స్ చూపించడానికి ప్రయత్నించాడంటూ వివాదం రేపింది. ఆమె త్వరలోనే మరో సంచలనం సృష్టించబోతోందని చాలామంది అప్పుడే ఊహించారు. అంతా ఊహించినట్టుగానే.. నిన్న అనురాగ్ కశ్యప్ ను కాస్టింగ్ కౌచ్ ఊబిలోకి లాగింది పాయల్ ఘోష్.

అయితే ఇక్కడే చిన్న క్లారిటీ మిస్సయింది పాయల్. గతంలో సోఫాలో కూర్చోబెట్టి నీలిచిత్రాలు చూపించడానికి ప్రయత్నించిన దర్శకుడు.. ఇప్పుడు సోఫాలో పడుకోబెట్టి జిప్ విప్పిన అనురాగ్ కశ్యప్ ఒక్కడేనా అనేది నెటిజన్లు డౌట్. ఈ డౌట్ పై పాయల్ క్లారిటీ ఇస్తే అప్పటి ఆరోపణ, తాజా ఆరోపణలు కలిసి ఒకే కేసు కిందకు వస్తాయి. లేదంటే పాయల్ విషయంలో 2 కాస్టింగ్ కౌచ్ కేసులవుతాయి.

మరోవైపు పాయల్ ఆరోపణల్ని అనురాగ్ కొట్టిపడేశాడు. తనపై ఆరోపణలు చేస్తూ, మరో ముగ్గురు హీరోయిన్లను ఈ వివాదంలోకి లాగడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. తను తన జీవితంలో ఎవ్వరితోనూ అనైతికంగా ప్రవర్తించలేదని స్టేట్ మెంట్ ఇచ్చాడు.

Related Stories