మళ్ళీ పెళ్లి చూపులు కాంబో

TeluguCinema 30 Oct 2023
vijaydevarakonda tarunbhascker

హీరోగా విజయ్ దేవరకొండకి మొదటి హిట్… పెళ్లి చూపులు. 8 ఏళ్ళు అయింది ఆ మూవీ వచ్చి. ఇప్పుడు విజయ్ దేవరకొండ యువ హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, స్టార్డం సంపాదించుకున్నాడు. “పెళ్లి చూపులు” దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ 8 ఏళ్ళల్లో కేవలం రెండు చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు. ఇప్పుడు మూడో చిత్రంగా తీసిన “కీడ కోలా” విడుదలకి సిద్ధంగా ఉంది.

“కీడ కోలా” సినిమా ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఒక ప్రకటన చేశాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాను అని తెలిపాడు. “రీసెంట్ గా తరుణ్ భాస్కర్ ఒక కొన్ని కథలతో వచ్చాడు. ఒక స్క్రిప్ట్ ఓకే చేశాను. అది త్వరలోనే ప్రారంభం అవుతుంది,” అని విజయ్ దేవరకొండ చెప్పాడు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం “ఫ్యామిలీ స్టార్” అనే సినిమా చేస్తున్నాడు. అది సంక్రాంతికి విడుదల అవుతుంది. ఆ తర్వాత దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తీసే పీరియడ్ చిత్రంలో నటిస్తాడు. మరి, తరుణ్ భాస్కర్ తో మూవీ ఎప్పుడు ఉంటుందో?

తరుణ్ భాస్కర్ కూడా వెంకటేష్ తో ఒక మూవీ చెయ్యాలి. కానీ అది ఆగిపోయింది.