- Advertisement -

కరణ్ జోహార్ టాక్ షోల్లో ఎక్కువగా అఫైర్ల ముచ్చటే ఎక్కువగా ఉంటుంది. విజయ్ దేవరకొండతో సాగిన కొత్త ఎపిసోడ్ లో అఫైర్లతో పాటు ఏఏ ప్రాంతాల్లో సెక్స్ లో పాల్గొన్నారో వంటి విషయాలను కూడా చర్చించారు.
విజయ్ దేవరకొండ, అనన్య పాండే కరణ్ జోహార్ నిర్మించిన ‘లైగర్’లో నటించారు. వారిని ఈ వారం తన షోకి గెస్ట్ లుగా పిలిచారు కరణ్ జోహార్. పబ్లిక్ ప్లేస్ లో ఎప్పుడైనా సెక్స్ చేశావా అని విజయ్ ని ప్రశ్నిస్తే ఆయన ఒక లిస్ట్ బయట పెట్టడం విశేషం.
అవి ఏంటంటే…
- కారు వెనుక సీట్లో
- సముద్రంలో బోట్ లో
ఇక హీరోయిన్ అనన్య పాండే తాను అలాంటివి ఎప్పుడూ చెయ్యలేదని తెలిపింది.
హీరోయిన్ రష్మిక మందానతో అఫైర్ నడుస్తోందా? అన్న ప్రశ్నకు, విజయ్ ఇచ్చిన సమాధానం: “తను నాకు మంచి మిత్రురాలు. నా గాళ్ ఫ్రెండ్ కాదు.”