పూజ కూడా ఫొటోలతో హీటెక్కిస్తోంది!

TeluguCinema 11 Jul 2021
Pooja Hegde


పూజ హెగ్డే టాప్ హీరోయిన్. ఆమె కొత్తగా జనాలని ఆకట్టుకునేందుకు, అవకాశాలు పొందేందుకు ఫోటోషూట్లు చెయ్యాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకో ఈ భామ ఇప్పుడు ఫోటోలు తెగ షేర్ చేస్తోంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అదరగొడుతోంది.

గత రెండు వారాలుగా ఆమె గ్యాప్ లేకుండా ఫోటోషూట్స్ తో ఇన్ స్టాగ్రామ్ టైంలైన్ ని ముంచెత్తుత్తోంది.

ఇప్పటికే, ఆమెకి ఇన్ స్టాగ్రామ్ లో 14 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కో కమర్షియల్ పోస్ట్ కి లక్షల్లో సంపాదిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఎంతమంది మిలియన్ల ఫాలోవర్స్ పెరిగితే అంతా ఆదాయం ఉంది సెలబ్రెటీలకు. ఒక యాడ్ పోస్ట్ చేస్తే చాలు లక్షలు లక్షలు వచ్చి పడుతాయి. ప్రియాంక చోప్రా వంటి భామలు ఒక్క పోస్ట్ కే కోట్లు తీసుకుంటున్నారు. బహుశా అదే టార్గెట్ పెట్టుకొంది కాబోలు పూజ హెగ్డే.

ALSO CHECK: Pooja Hegde’s latest photoshoot – stills

పూజ హెగ్డే నటించిన ‘ఆచార్య’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘రాధేశ్యామ్’ త్వరలోనే విడుదల కానున్నాయి. ఇక ఆమె నటిస్తున్న ‘బీస్ట్’ వచ్చే ఏడాది విడుదల అవుతుంది. కొత్తగా మరో మూడు సినిమాలు ఒప్పుకోనుంది.