ఆమెని అరెస్ట్ చేయొద్దు: సుప్రీంకోర్టు

Poonam Panday


శృంగార చిత్రాల భామ పూనమ్ పాండేకి ఊరట దక్కింది. ఆమెకి అరెస్ట్ నుంచి మినహాయింపునిచ్చింది సుప్రీంకోర్టు.

‘నీలి చిత్రాల’ కేసులో మహారాష్ట్ర పోలీసులు ఆమెని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ కేసులో ఆమెకి బెయిల్ నిరాకరించింది మహారాష్ట్ర కోర్టు. ఈ తీర్పుని సవాల్ చేస్తూ పూనమ్ పాండే సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. “కేసులో విచారణని కొనసాగించండి. కానీ, విచారణ పూర్తి కాకముందే ముందస్తుగా ఆమెని అరెస్ట్ చెయ్యొద్దు,” అని సుప్రీం పోలీసులను ఆదేశించింది. దాంతో పూనమ్ పాండే ఊపిరి పీల్చుకొంది.

ఇన్ స్టాగ్రామ్ లోనే హాట్ హాట్ వీడియోలు పెట్టే ఈ భామపై నీలి చిత్రాలలో నటించింది, నిర్మించింది అనే ఆరోపణలు ఉన్నాయి. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల నిర్మాణం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసులో పూనమ్ పాండే కూడా ఇరుక్కొంది. ఈ కేసులోనే మహారాష్ట్ర పోలీసులు ఆమెని అరెస్ట్ చేసేందుకు ఉపక్రమించారు.

ఇటీవలే ఈ భామ తన భర్త నుంచి కూడా విడిపోయింది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో కూడా అందాల ఆరబోతలో డోస్ తగ్గించింది.

Advertisement
 

More

Related Stories