పూనమ్ కు పెళ్లయిపోయింది

రసిక హృదయాలకు పూనమ్ పాండే గురించి పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో న్యూడ్ షోకు కేరాఫ్ అడ్రస్ పూనమ్ పాండే. ఒంటిపై నూలుపోగు ఉంచుకోవడానికి కూడా ఇష్టపడిన ఈ బ్యూటీ.. ఇప్పుడు నిండుగా ముస్తాబైంది. పెళ్లి దుస్తులు వేసుకుంది. బాయ్ ఫ్రెండ్ ను పెళ్లాడింది.

తనకు పెళ్లయిన విషయాన్ని ఇనస్టాగ్రామ్ లో ప్రకటించింది పూనమ్ పాండే. మనది ఏడు జన్మల బంధం అంటూ పెళ్లి ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. కొన్నాళ్లుగా పూనమ్-శామ్ బాంబే డేటింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లితో ఒకటయ్యారు.

న్యూడ్ ఫొటోలు, హాట్ వీడియోస్ తో పాపులర్ అయింది పూనమ్ పాండే. తన వీడియోలతో ఏకంగా ఆమె యాప్ కూడా పెట్టింది. ఆ యాప్ తో పాటు, యూట్యూబ్ ఛానెల్ తో ఆమెకు బాగానే డబ్బులు గిట్టుబాటు అవుతున్నాయి. వీటితో పాటు హిందీ-తెలుగులో సీ-గ్రేడ్ సినిమాలు చేస్తుంటుంది ఈ బ్యూటీ.

పెళ్లి తర్వాత పూనమ్ తన హాట్ షోను కొనసాగిస్తుందా లేక ఆపేస్తుందా అనే అనుమానాలు అక్కర్లేదు. ఎందుకంటే ఆమెకు తెలిసింది అదే, ఆమె జీవనాధారం కూడా అదే. 

Related Stories