మళ్లీ తల్లి కాబోతున్న పూర్ణ

హీరోయిన్ పూర్ణ మళ్లీ తల్లి కాబోతోంది. ఈ మేరకు ఆమె ఇనస్టాగ్రామ్ లో ప్రకటన చేసింది. ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే, టీవీ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
“మా హృదయాలు నిండిపోయాయి, మా కుటుంబం పెరుగుతోంది… ప్రేమించే వ్యక్తితో వివాహం చేసుకుని జీవించడం ఒక కల అయితే, తల్లిదండ్రులు కావడం అందమైన అధ్యాయం. మేం మా రెండో బిడ్డను స్వాగతించబోతున్నామని చెప్పడానికి సంతోషంగా ఉంది.”
ఇలా తను రెండోసారి గర్భందాల్చిన విషయాన్ని బయటపెట్టింది పూర్ణ. వచ్చే ఏడాది రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు కూడా తెలిపింది.
ALSO READ: Actress Poorna announces second pregnancy
రాబోయే రోజుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, కొత్త నవ్వులు, చిన్ని అడుగులు, అంతులేని ప్రేమ కోసం ఆశగా నిరీక్షిస్తున్నాని రాసుకొచ్చింది పూర్ణ. 2022లో దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లాడింది పూర్ణ. ఆమె దాదాపు దుబాయ్ లోనే సెటిలైంది. షూటింగ్స్ కోసం హైదరాబాద్ వస్తుంది.