150 కోట్లు వద్దనుకున్న ప్రభాస్!

Prabhas

డబ్బెవరికి చేదు? పెద్ద కష్టపడకుండానే 150 కోట్లు వచ్చే అవకాశం ఉంటే ఎవరైనా వదులుకుంటారా? కానీ ‘బాక్సాఫీస్ రారాజు’ ప్రభాస్ మాత్రం 150 కోట్లను వదులుకున్నాడని అంటున్నారు. ఇందులో నిజమెంతో కానీ ఈ న్యూస్ మాత్రం వైరల్ అయింది.

క్రేజున్న హీరోలందరి వెంట పెద్ద పెద్ద కార్పొరేట్ బ్రాండ్స్ పడుతాయి. తమ బ్రాండ్లను ప్రచారం చెయ్యాల్సిందిగా కోరుతాయి. ‘బాహుబలి’ సినిమా తర్వాత “మహేంద్ర SUV” కార్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు ప్రభాస్. కానీ ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు.

మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, సమంత, తమన్న, నాగార్జున, నాగ చైతన్య… ఇలా అందరూ పలు బ్రాండ్లు ప్రోమోట్ చేస్తూ అదనపు ఆదాయాన్ని ఫుల్లుగా పొందుతున్నారు. మహేష్ బాబు ప్రతి ఏడాది సినిమాల ద్వారా పొందే మొత్తానికి సమానంగా యాడ్స్ ద్వారా సంపాదిస్తుంటారని చెపుతారు. మరి ప్రభాస్ కు జాతీయస్థాయిలో ఉన్న క్రేజ్, పాపులారిటీకి ఎంత సంపాదించాలి? దీనిపైనే లెక్కలు వేసిందో బ్రాండ్ కంపెనీ.

ప్రభాస్ దాదాపు 150 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయాడు అని లెక్కలు కట్టారు. రీసెంట్ గా బ్రాండ్స్ ని ఒప్పుకొని ఉంటే ఆ రేంజులో ఇంకమ్ వచ్చి ఉండేదనేది అంచనా. ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘రాధేశ్యామ్’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Advertisement
 

More

Related Stories