అయిదు రాజు కథలే: ప్రభాస్

Prabhas in Japan

ప్రస్తుతం జపాన్ లో ఉన్నారు హీరో ప్రభాస్. అక్కడి అభిమానులతో ముచ్చటించారు. ప్రభాస్ కి జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. “బాహుబలి” రెండు భాగాలను కలిపి ఇటీవల “బాహుబలి ఎపిక్” పేరుతో ఇటీవల రిలీజ్ చేశారు కదా. దాన్నే వచ్చే వారం జపాన్ లో విడుదల చేస్తున్నారు. దాంతో అభిమానులను కలిశారు ప్రభాస్.

ప్రభాస్ చెప్పిన ముచ్చట్లు…

నన్ను రాజుగా చూపించాలనుకున్నారు

“రాజమౌళి నన్ను రాజుగా చూపించాలనుకున్నారు. రాజు కథానాయకుడిగా నాకు ఐదు కథలు చెప్పారు. అందులో నాకు అమరేంద్ర బాహుబలి రాజు కథ నచ్చింది. అదే బాహుబలి.”

కెరీర్ మారింది, నేను మారలేదు

“బాహుబలికి ముందు నాకు తెలుగునాట అభిమానులు ఉండేవారు. కానీ ఆ తర్వాత దేశమంతా, విదేశాల్లోనూ వచ్చారు. అందుకే బాహుబలి నా కెరీర్ ని పూర్తిగా మార్చింది అని చెప్తాను. పారితోషికం కూడా బాగా పెరిగింది. వ్యక్తిగా మాత్రం నేను ఏమి మారలేదు. నా స్నేహితులు పాతవాళ్లే. చిన్నప్పటి మిత్రులు, స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ నాతో మాట్లాడుతూనే ఉంటారు.”

More

 

Related Stories