తులసితో ఆ సంబంధం లేదు!

- Advertisement -
Tulasi Prabhassinu

1980లలో హీరోయిన్ గా నటించిన తులసి ప్రస్తుతం తల్లి పాత్రలు పోషిస్తున్నారు. యువ హీరోలకు, హీరోయిన్లకు తల్లిగా సెటిల్ అయిపోయారు. ఐతే, కొన్నాళ్ల క్రితం ఆమె తన కన్నా చాలా చిన్నవాడైన ఒక నటుడితో సన్నిహితంగా ఉంటున్నట్లు ప్రచారం జరిగింది. అప్పట్లోనే తులసి ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టారు.

ఇప్పుడు ఆ నటుడు బయటికి వచ్చి పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. అతను ఎవరో కాదు ప్రభాస్ శ్రీను. విలన్ గా, కామెడీ గ్యాంగ్ లో ఒకరిగా ఎన్నో చిత్రాల్లో నటించిన ప్రభాస్ శ్రీను తాజాగా ఒక టాక్ షోకి వచ్చి తన కెరీర్ గురించి, తన జీవితం గురించి అనేక విషయాలు వెల్లడించారు. ఆ తర్వాత అదే షోకి తులసిని రప్పించింది ఆ టాక్ షో టీం.

‘తులసి నాకు వయసులో తల్లిలాంటిది. ఆమెని నేను నిజ జీవితంలో కూడా అమ్మా అని అంటాను. మా గురించి అలాంటి ప్రచారం బాధించింది,” అని చెప్పారు ప్రభాస్ శ్రీను.

తులసికి 55 ఏళ్ళు. ప్రభాస్ శ్రీను కి 45 ఏళ్ళు. అతనికి పెళ్లి అయింది. ఒక కూతురు ఉంది. అందుకే, జనం అందరికి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని ఈ టాక్ షోని వినియోగించుకున్నారు.

More

Related Stories