- Advertisement -

ప్రభుదేవా చాలాకాలంగా తన మొదటి భార్యకి దూరంగా ఉంటున్నాడు. ఒక టైంలో నయనతారని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఎందుకో అది కుదరలేదు. నయనతార ఇప్పుడు విగ్నేష్ శివన్ అనే దర్శకుడిని పెళ్లాడనుంది. ఇక 47 ఏళ్ల ప్రభుదేవా … ఈ లాక్డౌన్ కాలంలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడని చెన్నై ఫిలిం ఇండస్ట్రీ కోడై కూస్తోంది.
ప్రభుదేవా ఒక ఫిజియోథెరపిస్ట్ ని పెళ్లాడాడు అనేది టాక్. అతని నడుము నొప్పికి ట్రీట్మెంట్ ఇచ్చిన ఆ డాక్టర్ తోనే అతనికి అనుబంధం పెరిగిందట. ఇప్పుడుద్ ఇద్దరూ చెన్నైలోనే కాపురం పెట్టినట్లు సమాచారం.
ఐతే, ప్రభుదేవా ఈ వార్తలపై ఇంతవరకు స్పందించలేదు. తమిళ్ మీడియాలో వార్తలు వచ్చినా సైలెంట్ గానే ఉన్నాడు.