ప్రదీప్, కృష్ణుడుకు క్లీన్ చిట్

140 మంది రేప్ కేసు నుంచి ప్రదీప్-కృష్ణుడుకు క్లీన్ చిట్ దక్కింది. ఆరోపణలు చేసిన నల్గొండ అమ్మాయి నేరుగా మీడియా ముందుకొచ్చింది. తనను రేప్ చేశారంటూ విడుదల చేసిన లిస్ట్ లో ప్రదీప్-కృష్ణుడు పేర్లను కావాలని పెట్టామని అంగీకరించింది.

డాలర్ బాయ్ అనే వ్యక్తి ఒత్తిడి చేయడం వల్లనే వాళ్లిద్దరి పేర్లతో పాటు మరికొంతమంది సినీ-రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు చెప్పాల్సి వచ్చిందని సదరు యువతి ఒప్పుకుంది. వీళ్లందర్నీ బ్లాక్ మెయిల్ చేయడానికే డాలర్ బాయ్ తనతో ఆ పేర్లు చెప్పించాడని అంటోంది యువతి.

140 మంది లిస్ట్ లో కేవలం 44 మంది మాత్రమే తనను రేప్ చేశారని, మిగిలినవాళ్లలో కొంతమంది తనను మెంటల్లీ హెరాష్ చేశారని చెప్పిన యువతి.. లిస్ట్ ను 3 భాగాలు చేశామని వెల్లడించింది. కేసుతో అస్సలు సంబంధం లేని లిస్ట్ లో ప్రదీప్-కృష్ణుడు పేర్లను చేర్చినట్టు వెల్లడించింది.

Related Stories